క్రికెట్ ఆటని ఎంజాయ్ చేయని వాళ్ళుండరు. తమకి నచ్చిన ఆటగాడు మైదానంలోకి అడుగుపెడుతుంటే ఆ ఆనందమే వేరు. ఐతే అలాంటి ఆటగాడికి ఆటలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఎంతో ఆందోళన పడుతుంటారు. ఆటలో గాయాలు సహజం. కానీ అజాగ్రత్త వల్ల గాయాలు అయితే మాత్రం ఆలోచించాల్సిందే. తాజాగా సన్ రైజర్స్ ఆటగాడు విజయ్ శంకర్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నాడు. పేస్ బౌలింగ్ లో హెల్మెట్ పెట్టుకుని స్పిన్ బౌలింగ్ రాగానే హెల్మెట్ తీసేసి క్రికెట్ ఆదుతున్నారు.
విజయ్ శంకర్ పరుగు తీస్తున్న టైమ్ లో నికోలస్ పూరన్ వికెట్ల వైపు బంతి విసరడంతో అది కాస్త విజయ్ శంకర్ కి తగిలింది. దాంతో అతడు గిలగిలా కొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాట్స్ మెన్ జాగ్రత్తల విషయంలో ఐసీసీకి సచిన్ సూచనలు చేసాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునేలా నియమం పెట్టాలని ఆ సూచన సారాంశం. మరి సచిన్ సూచనని పరిగణలోకి తీసుకుంటుందేమో చూడాలి. గతంలో క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, హెల్మెట్ ఉన్నా కూడా బంతి తలకి తగిలి తన ప్రాణాలు వదులుకొన్న విషయం గుర్తుతెచ్చుకోవాలి.