కరోనా ఉధృతి విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఛీఫ్ సెక్రటరీ సహా జిల్లా అధికారులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి వచ్చే కొన్ని రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాడు. దీపావళి పండగ దగ్గరకొస్తున్న ప్రస్తుత సమయంలో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల క్రాకర్స్ పై నిషేధం విధిస్తున్నామని తెలిపాడు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లని పెంచమని కోరుతూ కోరిన దానికి ఢిల్లీ హైకోర్టులో స్టే పడిందని, ఈ విషయమై సుప్రీం కోర్టుకి వెళ్తున్నామని అన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉన్న కారణంగా కరోనా విస్తరణ మరింత పెరగనుందని, అందుకే క్రాకర్స్ పై నిషేధం విధిస్తున్నామని, దీపావళి రోజున దీపాలు మాత్రమే వెలిగించి, పండగ జరుపుకోవాలి, వచ్చే రోజులు మరింత బాగా ఉండడానికి ఈ సంవత్సరం కొన్ని పాటించక తప్పవని పలికాడు.