తెలంగాణలో దుబ్బాక బైపోల్ ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్ వేళ కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది..టెక్నికల్ సమస్యలో ఉదయం 8:00 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. 8:15కు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను కొద్దిసేపటి క్రితమే అధికారులు ఓపెన్ చేశారు.
దుబ్బాక వ్యాప్తంగా దాదాపు 15వేల పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి.. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది. దుబ్బాక భవిత మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.