కరోనా వైరస్ నియంత్రణ కోసం స్పుత్నిక్ టీకాను డెవలప్ చేసిన రష్యా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసింది. కరోనా రోగుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ సుమారు 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని తెలిపింది. ఇప్పటికే ఆదేశం ఆ టీకాను మార్కెట్లోకి కూడా విడుదల చేసింది. గత రెండు రోజుల క్రితమే క్రితమే అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తాము రూపొందించిన కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు ప్రకటించింది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్.. ఇండియాలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్వహిస్తోంది. మన దేశంలో స్పుత్నిక్-వి టీకాను కూడా రెడ్డీస్ ల్యాబ్ సప్లై చేయనుంది. తమ వ్యాక్సిన్ కి భారత్ అనుమతించినట్లైతే వంద మిలియన్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌కు సరఫరా చేయనున్నట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది.