భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేసి గత ఏడాదే పదవీ విరమణ చేసిన డా. కేజే రమేశ్ కు నూతన బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. డా. కేజే రమేశ్ ను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్” ఫుల్ టైమ్ టెక్నికల్ మెంబర్ గా నియమించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఫుల్ టైమ్ టెక్నికల్ మెంబర్ గా డా. కేజే రమేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ గా గత ఏడాదే పదవీ విరమణ చేసిన డా. కేజే రమేశ్ ఈ నూతన నియామకంతో మూడేళ్ల పాటు కమిషన్ ఫుల్ టైమ్ టెక్నికల్ మెంబర్ గా కొనసాగనున్నారు. వాయు కాలుష్యం నుంచి ఢిల్లీని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేసిన డా. కేజే రమేశ్ కి రంగంలో విశేష అనుభవం ఉంది.