చిరంజీవికే ఝలక్ ఇచ్చిన కరోనా.. ‘పోయాం మోసం’ !

-

అదేదో సినిమాలో పోయా మోసం అనే ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. చిరంజీవి పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా పాజిటివ్ వచ్చిందని అని స్వయంగా ప్రకటించుకున్నాడు. 9వ తారీఖున ఆచార్య షూటింగ్ కి వెళ్లేదుకు గాను కరోనా test చేయించగా ఆయనకి అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంకేముంది ఆయనకి కరోనా సోకిందన్న విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆయన తోటి సహచర నటులు అందరూ ఆయన ఆరోగ్యం కుదుట పడాలని పూజలు పునస్కారాలు మొదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పారు చిరంజీవి. అదేంటంటే చాలా మంది డాక్టర్లు చాలా సార్లు పరీక్ష చేసిన తర్వాత నాకు కరోన సోకలేదు అని తేల్చారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ యథాతధంగా వివరించే ప్రయత్నం చేస్తాం. “కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడుకున్నాయి.

ఆదివారం చేయించిన టెస్ట్ లో పాజిటివ్ ఉన్న తర్వాత బేసిక్ మెడికేషన్ మొదలు పెట్టాను. రెండు రోజులైనా ఎక్కడ ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి నాకే అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సిటీ స్కాన్ తీసి చెస్ట్ లో అయితే ఎలాంటి డ్రెస్ లేవు అన్న నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని మరో సారి మరో చోట కూడా చూడాలని టెనెట్ ల్యాబ్ లో మూడు రకాల కిట్లతో టెస్ట్ చేయించాను. ఆ మూడు చోట్ల నాకు నెగిటివ్ అని వచ్చింది. ఫైనల్ గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన చోట మళ్ళీ ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగిటివ్ అని వచ్చింది ఇన్ని రిపోర్లు తర్వాత మొదటి రిపోర్టు ఒక ఫాల్టీ కిట్ వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకి వచ్చారు. ఈ సమయంలో మీరు అందరూ చూపించిన కన్సర్న్, ప్రేమాభిమానాలకు చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపాడు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news