షాకింగ్: ఇతర రాష్ట్రాల మద్యం వెనుక చంద్రబాబు: ఏపీ మంత్రి

-

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తరలింపు వెనుక చంద్రబాబు హస్తం ఉంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 80 శాతం స్మగ్లింగ్ ఆక్టివిటీ లో చంద్రబాబు హస్తం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. డ్రైవర్లు, క్లీనర్ పై కాకుండా స్మగ్లింగ్ చేస్తున్న వాహన యజమానిపై కేసులు పెట్టాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు.

ఏ పార్టీ నాయకులు వీటి వెనుక ఉన్నా సహించం అని స్పష్టం చేసారు. మద్యపానం నిషేదం కావాలా వద్దా అనేది చంద్రబాబు స్పష్టం చేయాలి అని డిమాండ్ చేసారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా మద్యపాన నిషేదం చేస్తున్నాం అని ఆయన తెలిపారు. గతంలో మద్యం షాపులు రెంటు కు తీసుకున్నాం అని, అధిక రెంట్ లకు షాపులు తీసుకున్నారు అని సీఎం జగన్ దృష్టిలో పెట్టాను అని, రివర్స్ టెండరింగ్ ద్వారా 108.84 కోట్లు ఆదా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news