టీ కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి మాజీ కేంద్ర మంత్రి !

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయాన ఇప్పటికే పూర్తిగా అభ్యర్ధులను కూడా సరిగా ప్రకటించుకోలేక పోయిన కాంగ్రెస్‌ కు మరో భారీ షాక్ తగలనుంది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ హస్తానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సర్వే సత్య నారాయణ ఇంటికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెళ్లి బీజేపీలో చేరాలని సర్వే సత్యనారాయణను ఆహ్వానించారు.

అయితే దానికి సానుకూలంగా స్పందించిన అయన బీజేపీ లో జాయిన్ అవుతున్నానని ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లి జాయిన్ అవుతానన్న అయన. హై కమాండ్ తో మాట్లాడాక ఏమి చేస్తానో కూడా చెబుతానని అన్నారు. జాయిన్ కావడానికి ఇదే సరైన సమయం అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటికే విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈయన కూడా పార్టీ మారడం అంటే పార్టీకి షాక్ అని చెప్పక తప్పదు.  

 

Read more RELATED
Recommended to you

Latest news