ఫస్ట్ టైమ్ ఓటేస్తున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..!

-

Are you a first time voter, you should know these things

ఫస్ట్ టైమ్ ఓటేస్తున్నారా? ముందుగా మీకు అభినందనలు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఫస్ట్ టైమ్ ఓటేసేవాళ్లు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. పోలింగ్ స్టేషన్ కు వెళ్లే ముందు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. దాని కోసం ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గర్లోని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మీదగ్గర ఏదో ఒక ఐడీ కార్డు ఉండాలి. అది ఓటర్ ఐడీ కార్డు కానీ.. లేదా పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్ బుక్, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఎంప్లాయి ఐడీలో ఏదో ఒకటి తీసుకెళ్లొచ్చు. దాంతో పాటు ఓటరు స్లిప్ కూడా తీసుకెళ్లండి. మీకు ఓటరు స్లిప్ ఎవరూ ఇవ్వకపోతే.. పోలింగ్ బూత్ వద్ద ఉండే కౌంటర్లలో తీసుకోవచ్చు.

పోలింగ్ బూత్ కు వెళ్లగానే క్యూలో నిలుచోండి. మీ ఐడీ, ఓటర్ స్లిప్ ను సిద్ధంగా పెట్టుకోండి. లోపలికి వెళ్లగానే ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేస్తాడు అధికారి. మీ పేరు ఉంటే.. వెంటనే మరో అధికారి దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాడు. ఆ అధికారి మీ ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా అంటిస్తాడు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు మీకు. ఆ చీటిని ఇంకో అధికారికి ఇవ్వాలి. దీంతో ఆ అధికారి మీకు ఓటు వేయడానికి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు మీరు ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్లి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయవచ్చు. దాని తర్వాత వీవీప్యాట్ దగ్గరికి వెళ్లండి. అక్కడ మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేస్తారో దానికి సంబంధించిన స్లిప్ కనిపిస్తుంది. 7 సెకండ్ల పాటు ఆ స్లిప్ మీకు కనిపిస్తుంది. తర్వాత అది వేరే బాక్స్ లో పడిపోతుంది. అంతే మీరు ఓటు వేసే ప్రక్రియ పూర్తవుతుంది.

ఒకవేళ మీరు ఓటేసిన పార్టీ, వీవీప్యాట్ స్లిప్ లో కనిపించిన పార్టీ వేర్వేరుగా ఉంటే వెంటనే పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేయండి. టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగి ఉంటే వాళ్లు వెంటనే దాన్ని సరిచేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news