ఆ కరోనా వ్యాక్సిన్ జస్ట్ 10 డాలర్లే…?

-

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారి విషయంలో రష్యా చాలా దూకుడుగా ఉంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో పరిక్షలు పూర్తి చేసుకోకుండానే వ్యాక్సిన్ తయారు చేసామని చెప్పిన రష్యా ఇప్పుడు దానికి ధరలను కూడా నిర్ణయించడం గమనార్హం. రష్యా తయారు చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ఒక మోతాదు ధర అంతర్జాతీయ మార్కెట్ లో 10 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీ ప్రకటించింది.

టీకా రష్యన్ పౌరులకు ఉచితంగా అందిస్తుంది అక్కడి ప్రభుత్వం. 2021 లో 500 మిలియన్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో అక్కడి ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. తమ వ్యాక్సిన్ అమెరికా తయారు చేసే వ్యాక్సిన్ కంటే తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news