తెలంగాణాలో డిసెంబర్ 7 శుక్రవారం పొలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం మీద 67.7% పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే హైదరబాద్ లో మాత్రం 42 శాతమే పోలింగ్ జరగడం ఆశ్చర్యపరుస్తుంది. పోలింగ్ డేను హాలీడేగా ఎంజాయ్ చేస్తూ ఓటు వేయాలన్న ప్రాధమిక బాధ్యతను మరిచిపోతున్నారు నేటి యువత. హైదరాబాద్ పోలింగ్ శాతంపై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హైదరాబాద్ ఓటర్ సిగ్గుపడాలంటూ ఘాటు కామెంట్ పెట్టాడు.
ఇక మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఓటు వేయని వాడు గాడిద అంటూ ఫైర్ అయ్యారు. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే ప్రజా హక్కుని వినియోగించుకోకపోవడం పెద్ద తప్పని ఆయన అన్నారు. ఓటు విలువని చెబుతూ ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పుకొచ్చినా లాభం లేదని తెలుస్తుంది. ఒంట్లో బాగాలేకనో.. కదల్లేని పరిస్థితుల్లో ఉంటే తప్ప ఆరోగ్యంగా ఉండి కూడా ఓటు వేయని వారిని అసలు క్షమించకూడదని అన్నారు నాగ బాబు.