వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా తమ గొంతు వినిపించడానికి దేశవ్యాప్త రైతులందరూ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనలని నిలిపివేయడానికి భారత సైన్యాన్ని రంగంలోకి దింపింది. రైతులు నిరసన చేపట్టకుండా ఉండడానికి జవానులు లాఠీ ఝళిపించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో వృద్ధ రైతుపై లాఠీతో కొడుతున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ సరిహద్దుల్లో నిలబడి దేశానికి రక్షణ కవచంలా ఉండే జవాను లాఠీతో కొడుతున్న ఫోటో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఫోటోని షేర్ చేస్తూ, బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికారం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తమ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పేర్కొన్నారు.