దారుణంగా గ్రేటర్ పోలింగ్.. వాళ్ళని చూసి సిగ్గుపడాలి !

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ మరీ దారుణంగా నమోదవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి ఎక్కడా కనబడటం లేదు పాతబస్తీలో తమ ఓట్లు లేకపోవడంతో ఓటు వేద్దామని వచ్చిన వారు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల చరిత్రను చూస్తే దీని ఓటింగ్ శాతం ఎన్నడూ 46 శాతానికి మించి పోల్ అవ్వలేదు.. ఈసారి అంతకన్నా దారుణమైన పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది.

ఒకవేళ మా పోలింగ్ శాతం పెరిగితే అది తమ పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ స్థాయిలో బెట్టింగ్ లు కూడా వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీల మీద జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. ఇక అందుతున్న సమాచారం మేరకు 9 గంటల దాకా నమోదైన పోలింగ్ శాతం కేవలం 4 శాతంగా తేలింది.. అంటే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. నిజానికి చాలా చోట్ల వృద్ధులు వయస్సు పైబడిన వారే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. యువత పెద్దగా కనపడడం లేదు .    

Read more RELATED
Recommended to you

Latest news