ఈరోజు ఏపీ అసెంబ్లీలోని ఉభయ సభల్లో కీలక బిల్లులు వివిధ అంశాలపై చర్చ జరగనుంది. పోలవరం, బీసీ సంక్షేమ కార్పోరేషన్ల ఏర్పాటు, కరోనా కట్టడిపై అశెంబ్లీలో చర్చ జరగనుంది. కరోనా కట్టడి, ఉద్యోగుల సంక్షేమం, శాంతి భద్రతలపై మండలిలో చర్చ జరగనుంది. అలానే ఈరోజు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. దిశా, వ్యవసాయ మండలి, ఏపీఎస్డీసీకి చట్టబద్దత, ఎఫ్ఆర్బిఎం, ఇంధన చట్ట సవరణ తదితర బిల్లులపై చర్చించనుంది అసెంబ్లీ.
అలానే మండలిలో ఐదు బిల్లులపై చర్చ జరగనుంది. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్, ఆక్వా సీడ్, ఫిషరీస్ యూనివర్శిటీ, ఏపీ గేమింగ్ సవరణ తదితర బిల్లులపై శాసన మండలిలో చర్చ జరగనుంది. ఇక ఇసుక సమస్య మీద శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది టీడీపీ. నూతన ఇసుక విధానంతో భవన కార్మికులు ఉపాధి కోల్పోయారని, సామాన్యులకు ఇసుక దొరకడం లేదు..కాంట్రాక్టర్లు, నేతలు దోచుకుంటున్నారని టిడిపి ఆరోపిస్తోంది.