యాంకర్ అనసూయ సినిమాల వేగం బాగా పెంచింది. రంగమ్మత్త వంటి విభిన్నమైన పాత్రలో కనిపించిన అనసూయ, తన తర్వాతి పాత్రల్లో కూడా వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది. తాజాగా థ్యాంక్యూ బ్రదర్ చిత్రంలో గర్భిణీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పుడిప్పుడే స్పీడ్ అప్ అవుతున్న అనాసూయ, తమిళంలోనూ ఎంట్రీ ఇస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో అనసూయ ఓ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆ పాత్ర వివరాలు, సినిమా పేరు వగైరా బయటపెట్టనప్పటికీ, తాజాగ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. 80, 90లల్లో ఐటమ్ సాంగ్స్ లో ఉర్రూతలూగించిన సిల్మ్ స్మిత గెటప్ లో అనసూయ కూర్చుని ఉంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో అచ్చం సిల్క్ స్మిత లాగే కనిపిస్తుంది. మరి ఫోటోకి, సినిమాలోని తన పాత్రకి ఏదైనా సంబంధం ఉందా అన్నదే తెలియాలి.
View this post on Instagram