జడ్జ్ లను దూషించిన కేసు : సీబీఐ నివేదికలో కీలక అంశాలు !

-

హై కోర్టును, న్యాయమూర్తులను దూషించిన కేసుని ఏపి హై కోర్టు ధర్మాసనం విచారించింది. అయితే ఈ విచారణలో భాగంగా నివేదిక సమర్పించిన సిబిఐ, ఇప్పటికే జడ్జిలను దూషించిన వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశా,అమో పేర్కొంది. నిందితులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్నారని అందుకే వీరిని అదుపులోకి తీసుకుని విచారణ పూర్తి చేసేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొంది. అంతవరకు సిబిఐకి సమయం ఇవ్వాలని కోరింది.

ఈ మేరకు సిబిఐ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో విచారణ వచ్చే ఏడాది మార్చి 31వ తేదికి వాయిదా వేశారు. న్యాయమూర్తులను కించపరిచేలా పెట్టిన పోస్టింగ్ పై  తమ క్యాడర్ కు అండగా ఉంటామని వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు పండుల రవీంద్ర బాబు,ఆమంచి కృష్ణ మోహన్ లాంటి వారిని కూడా విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ముందు ప్రభుత్వం సీఐడీ విచారణ ఆదేశించింది. ఈ విచారణతో తృప్తి చెందని హైకోర్టు ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news