ఎమ్మెల్యే కుమారుడి ఎంట్రీ..రసవత్తరంగా రాజోలు వైసీపీ రాజకీయం

-

రాజోలు అధికార వైసిపిలో మూడు ముక్కలాటకు ముగింపు పలికే సమయం దగ్గరపడినట్లే కనిపిస్తుంది.
అధిష్ఠానం సైతం పార్టీని గాడిలో పెట్టే పనిలో పడింది. ఇక ఉన్న గ్రూపులకు సరికొత్తగా వైసిపిలో చేరిన ఎమ్మెల్యే కుమారుడికి కో ఆర్డినేటర్ పదవి అంటూ ప్రచారం మొదలైంది. ఇందు కోసమే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రత్యేక ప్యూహం సిద్దం చేసుకున్నారట..రాపాక నేరుగా పార్టీ మారడానికి చిక్కులు ఉండటంతో కుమారుడిని అధికార వైసిపిలో చేర్చడం ద్వారా ఇప్పుడు కో – ఆర్డినేటర్ పోస్టు కొట్టేయాలని చూస్తున్నారంటా…


తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవలే వై.సి.పి.లోకి పరోక్షంగా చేరారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన కుమారుడు వెంకటరామ్ వై.సి.పి. తీర్థం పుచ్చుకున్నారు.తన కంటే ముందు కుమారుడిని వై.సి.పి.లో చేర్చిన రాపాక ఇప్పుడు సొంత నియోజకవర్గం రాజోలులో పార్టీపై పట్టు సాధించే పనిలో నిమగ్నమయ్యారు. కుమారుడిని రాజోలు వైసిపిలో కీలకంగా ఫోకస్ చేస్తూ పార్టీ శ్రేణులు అతడి వెంట ఆకర్షితులయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది నెలలకే రాపాక వరప్రసాద్ అనధికారికంగా వై.సి.పి.లోకి వెళ్లిపోయారు. జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తే…టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరహాలో ప్రత్యేక సభ్యుడుగా స్పీకర్ వద్ద గుర్తింపు సాధించవచ్చనే రాపాక వ్యూహం ఫలించలేదు. అసలు తమ పార్టీకి ఓ ఎమ్మెల్యే ఉన్నారనే విషయాన్ని సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వదిలిపెట్టేశారు. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యే రాపాక ఊహించని వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.

రాపాక సొంత నియోజకవర్గం రాజోలులో ఇప్పటికే వై.సి.పి.లో గ్రూపుల గోల కొనసాగుతోంది. మాజీ కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వర్రావుకూ… నియోజకవర్గానికి వలస వచ్చి కోఆర్డినేటర్ పదవి దక్కించుకున్నపెద్దపాటి అమ్మాజీకి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. కొత్తగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన కుమారుడు వెంకటరామ్ ని నియోజకవర్గ వైసిపి యువనేతగా ఫోకస్ చేసి స్థానిక నేతల మద్దతు కూడగడుతూ పార్టీలో పట్టుసాధించే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుత కోఆర్డినేటర్ పెదపాటి అమ్మాజీని తప్పించి రాపాక కుమారుడికి ఆ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనీ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది.

రాజోలు రాజకీయాలను నడిపించే పెద్దలు సహా జిల్లాకు చెందిన మంత్రులు విశ్వరూప్… వేణులు తమకు సన్నిహితుడైన జనసేన ఎమ్మెల్యేను ఆ ఉద్దేశంతోనే పార్టీలోకి తీసుకొచ్చారనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే వలస వచ్చిన అమ్మాజీతోపాటు బొంతు రాజేశ్వరరావు ముటముళ్లే సర్దుకుని పోవడం ఖాయమనే టాక్ ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తుంది. రాబోయే రోజుల్లో రాజోలు వైసీపీ వర్గపోరు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news