ప్రభాస్ సినిమాలో అవకాశం కోసం బారులు తీరిన ఆర్టిస్టులు..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ తెరకెక్కడానికి నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. చిత్రీకరణ చివరి దశకి వచ్చేసిన రాధేశ్యామ్ తో పాటు, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని సినిమా లైన్లో ఉన్నాయి. ఐతే ఇటీవలే ప్రకటించిన సలార్ చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఆర్టిస్టులు కావాలని ప్రకటించడమే అందుకు కారణం.

ఆడిషన్ కాల్ బయటకి వచ్చినప్పటి నుండి నటీనటుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ప్రభాస్ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్ కి వేలల్లో ఆర్టిస్టులు వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీస్ బందోబస్తు కూడా రావడం ఆశ్చర్యకరం. వివిధ రకాల వయస్సులకి చెందిన వారు వివిధ భాషల నుండి వచ్చారు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. మరి ఆడిషన్ ద్వారా అవకాశం తెచ్చుకుని ఈ సినిమాకి ఎంతమంది ఎంపిక అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news