మాస్టర్ టీజర్: థలపతి విజయ్ యాక్షన్ డ్రామా..

-

తమిళ హీరో థలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్టర్. కరోనా రాకపోయుంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజై ఎప్పుడో పాతబడిపోయేది. లాక్డౌన్ కారణంగా రిలీజ్ ఆలస్యం అవుతున్న ఈ సినిమా టీజర్, ఈ రోజే రిలీజైంది. నిజానికి తమిళ టీజర్ ఎప్పుడో రిలీజైంది. ఆల్రెడీ యూట్యూబ్ లో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. వ్యూస్, లైక్స్, కామెంట్స్.. అన్నింటిలోనూ తనదైన రికార్డుని క్రియేట్ చేసింది. ప్రస్తుతం మాస్టర్ సినిమా తెలుగు టీజర్ విడుదలైంది.

ఇందులో విజయ్, ప్రొఫెసర్ గా కనిపిస్తున్నాడు. ప్రొఫెసర్ గా కనిపిస్తూనే తనదైన నటనతో మాస్ సన్నివేశల్లో ఇరగదీసేలా ఉన్నాడు. టీజర్ ఆద్యంతం యాక్షన్ సీన్లతో మిళితమై ఉంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా కనిపిస్తున్నాడు. విలన్ కి, ప్రొఫెసర్ కి మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ విజయ్ అభిమానులని ఉర్రూతలూగించేలా ఉన్నాయి. ఖైదీ సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, మాస్టర్ సినిమాతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news