తొమ్మిది నెలలుగా ప్రపంచ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న కరోనా, తాజాగా తన పంజని విసరడానికి మళ్ళీ రెడీ అయ్యింది. ఆల్రెడీ కరోనా కారణంగా ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఎందరో తమ ఉద్యోగాలని కోల్పోయారు. మరెంతో మంది రోజువారి జీవితాన్ని వెళ్ళదీయడానికి కష్టపడుతున్నారు. ఇన్ని ఇబ్బందుల్లో నుండి ఇప్పుడిప్పుడే మెల్లగా బయటపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కొత్తరూపం ప్రజలని మరింత భయాందోళనలకి గురి చేస్తుంది.
బ్రిటన్ లో విజృంభిస్తున్న ఈ కొత్తరూపం అందరినీ భయపెడుతుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందని వినిపిస్తున్న క్రమంలో కొత్తరూపం మరింత ఆందోళనని కలిగిస్తుంది. ఐతే ఈ వ్యాక్సిన్ కరోనా కొత్తరూపానికి పని చేస్తుందా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనిపై పరిశోధనలు జరిపిన వైద్యబృందం తెలిపిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఈ కరోనా కొత్త రూపానిపై పనిచేస్తుందట. నిజానికి కరోనా వైరస్ ప్రతీసారి తన రూపాన్ని మార్చుకుంటుందట. ఇప్పటి వరకూ అలా చాలా రూపాలు మారిందట. కానీ ఇప్పుడు వచ్చిన రూపం మాత్రమే బాగా భయపెడుతుందట.