కరోనా కారణంగా ఈ సంవత్సరం ఎక్కువ వాడుకలోకి వచ్చిన పదాలు…

-

సజావుగా సాగుతున్న జీవితాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించింది. తొమ్మిది నెలలవుతున్నా దాని ప్రభావం ఇంకా తగ్గట్లేదు. అయిపోయిందనుకుంటున్న క్షణంలో కొత్తరూపం అంటూ మళ్లీ భయపెట్టసాగింది. ఈ కరోనా కారణంగా మానవజాతి ఇంతకుముందెన్నడూ కూడా ఊహించని పరిణాలని అనుభవిస్తుంది. కరోనా రాకముందు ఒక నెలరోజుల పాటు రోడ్ల మీద అసలేమీ తిరగకుండా ఉంటుంది అని ఊహించను కూడా ఊహించలేదు. ఒకవేల ఎవరైనా అలా అనుకున్నా అది సాధ్యమయ్యే పనే కాదు అని తేల్చేసేవాళ్ళు.

corona
corona

కానీ మనం ఊహించను సంఘటనల్ని సంభవించేలా చేసింది కరోనా వైరస్ మాత్రమే. కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త మార్పులు వచ్చాయి. వాటిల్లో ఒకటి కొత్త పదాలు ఎక్కువగా వాడుకలోకి రావడం. అంతకుముందు అసలు వినని పదాలు కరోనా వచ్చిన తర్వాత వైరల్ అయ్యాయి. ఆ పదాల కథాకమామీషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లాక్డౌన్

లాక్డౌన్ అనే పదం గుర్తుకు వస్తే కరోనా వైరసే గుర్తుకు వస్తుంది. ఒక చిన్న సూక్ష్మజీవి కారణంగా ప్రపంచం మొత్తం తన పనులన్నింటినీ ఆపేసింది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ లాక్డౌన్ అనే పదం పాపులర్ అయ్యింది.

క్వారంటైన్

ఈ పదం కరోనా వచ్చాకే పాపులర్ అయ్యింది. కరోనా వస్తుందేమోనని భయపడి 14రోజుల పాటు ప్రపంచాన్నుండి వేరుపడటం. హోమ్ క్వారంటైన్ అనేది మనదేశంలో ఇంకా పాపులర్..

ఐసోలేషన్

కరోనా సోకిన వ్యక్తిని ఒక రూంలో ఉంచి అతని నుండి మరో వ్యక్తికి వైరస్ సోకకుండా చూసుకోవడం.

ఫేస్ మాస్క్

ఒకప్పుడు ఆడవాళ్ళు స్కార్ఫ్ ధరించి రోడ్డు మీద కనిపిస్తే అదోలా చూసేవారు. కానీ ప్రస్తుతం మాస్క్ లేకపోతే అదోలా చూస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అందరికీ తెలిసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులే కాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు హోమ్ నుండే జరుగుతున్నాయి.

జూమ్ మీటింగ్స్

చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వద్దంటూ పాఠశాల ఉపాధ్యయులు చెప్పేవారు. కానీ ఇప్పుడు వాళ్లే మొబైల్ ఫోన్ పిల్లల చేతికి ఇవ్వాలని అంటున్నారు.

ఇంకా, మహమ్మారి, ఆన్ లైన్ క్లాసులు, అన్ లాక్, ఇమ్యూనిటీ, వైరస్, వ్యాక్సిన్ మొదలగునవి బాగా పాపులర్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news