మరో వారంలో పెళ్లి.. కాబోయే భార్య ప్రియుడి చేతిలో దారుణ హత్య !

-

మరో వారంలో పెళ్లి ఉందనగా కర్నూలు జిల్లాలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే ఆళ్లగడ్డకి చెందిన యువకుడు మొగల్ గఫార్ దారుణ హత్యకు గురయ్యాడు. మొగల్ గఫార్ ఆళ్లగడ్డ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కొందరు దుండగులు అడ్డగించి దాడి చేశారు. కత్తులతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గఫార్ స్పాడ్ లోనే చనిపోయాడు.

murder
murder

గఫార్ కు ఇటీవలే ఆళ్లగడ్డ కు చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతితో నిశ్చితార్థం అయింది. త్వరలోనే పెళ్లి జరగాల్సి ఉండగా ఇంతలోనే దారుణ హత్యకు గురయ్యాడు. యువతి ప్రియుడు శేఖర్ ఈ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య చేసిన వెంటనే ఫోన్ లో తన ప్రియురాలితో ప్రియుడు శేఖర్ మాట్లాడినట్టు గుర్తించారు పోలీసులు. కాల్ డేటా ఆధారంగా యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హతుడు మొగల్ గఫర్ ది ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news