కేసీఆర్ లో మార్పు …ఎందుకో తెలుసా …!?

-

ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడ రిజిస్ట్రేషన్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.గతంలో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయంతెలిసిందే. రాష్ట్రంలో పలు చోట్ల ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడ రిజిస్ట్రేషన్ చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి . ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కొన్ని నెలలుగా కొనసాగిస్తున్న ఎల్ఆర్ఎస్ అంశంపై ప్రతిష్టంభనకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఫ్లాట్ల రిజిష్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో అనుమతి పొందిన ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. ఇప్పటికి రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికి ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అయితే.. కొత్త ప్లాట్లు.. అంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్లు జరగని వాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరిగా తేల్చారు.

ఈ విధానం కారణంగా ఇంతకాలం ఇబ్బందులు పడుతున్న వారందరి కష్టాలు తీరినట్లే. దీంతో.. ఆగస్టు 26న ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవరించినట్లుగా చెప్పాలి.కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తరువాతే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం… మూడు నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్‌సైట్‌తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

.ప్రతి ఫ్లాట్‌కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.ఈ నేపథ్యంతో తాజాగా గతంలో అనుమతి పొంది రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవసరం లేదని తెలిపిన ప్రభుత్వం… కొత్త ఫ్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.రాష్ట్రంలోని పలు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఎదుట రియల్ ఏస్టేట్ వ్యాపారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Read more RELATED
Recommended to you

Latest news