ఎన్టీఆర్ ఆడియో వెన్యూ చేంజ్

-

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్.టి.ఆర్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2019 జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ముందు ఒక సినిమాగా అనుకున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా వస్తుంది. మొదటి పార్ట్ సంక్రాంతికి ఫిక్స్ చేశారు. రెండో పార్ట్ జనవరి 24న అనుకున్నా అది కాస్త ఫిబ్రవరికి వాయిదా పడుతుందని అంటున్నారు.

ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ ఆడియో ఈ నెల 21న ఎన్.టి.ఆర్ స్వస్థలం అయిన నిమ్మకూరులో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాని ఇప్పుడు ఆ వెన్యూ హైదరాబాద్ కు మారిందట. ప్రస్తుతం నిమ్మకూరులో వాతావరణ పరిస్థితి బాలేదని హైదరాబాద్ కు మార్చారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం అసలు కారణం అది కాదని.. జాతకాలు.. గ్రహ దోషాలు ఎక్కువగా నమ్మే బాలకృష్ణ నిమ్మకూరులో ఆడియో జరపడం వల్ల అంత మంచిది కాదని తెలుసుకుని వేదిక మార్చేశాడని అంటున్నారు.

ఇక ఈ ఈవెంట్ కు జూనియర్ వస్తాడా రాడా అన్నది కూడా పెద్ద చర్చగా మారింది. ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ వచ్చాడు. నందమూరి ఫ్యామిలీ అంతా పాల్గొనే ఎన్.టి.ఆర్ వేడుకలో తారక్ కు స్థానం ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news