జానారెడ్డి లేఖతో టీ కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికొచ్చిందా

-

తెలంగాణ పీసీసీ నియామకం.. ఆఖరి వరకు వచ్చి బ్రేక్ పడింది..నల్గొండ జిల్లాలో బలమైన నాయకత్వం ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కి పీసీసీ లో తాము అనుకున్న పదవి దక్కకపోతే పార్టీలో ఉండరా.. కోమటిరెడ్డి బ్రదర్స్ నో అంటే నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి కి నిజంగానే కష్టమా.. జానారెడ్డి లేఖ కేవలం వ్యూహంలో భాగమేనా.. జానారెడ్డి చెప్పడం… పీసీసీ నియామకం ఆగడం.. సాధ్యమయ్యే పనేనా.. మేడం నిర్ణయం ఫైనల్ చేసిన తర్వాత ఆగడం వెనక ఏం జరిగింది..ఇప్పుడిదే అంశం టీ కాంగ్రెస్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

తెలంగాణ పీసీసీ..ప్రచార కమిటీ పోస్టుల భర్తీకి మేడం సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ప్రకటనే తరువాయి అన్న సమయంలో జానారెడ్డి కాల్ చేసి ఆపేశారు. వినడానికి కొంత విడ్డురంగానే ఉన్నా… కారణం అయితే ఇదే అని శంకంలో పోసి..తీర్థం అనిపించేశారు. పీసీసీ గా జీవన్ రెడ్డి. ప్రచార కమిటి చైర్మన్ గా రేవంత్ ని డిసైడ్ చేసిన తర్వాత…రేవంత్ మళ్ళీ పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని అధిష్ఠానంకి పంపించారు. ఆ తర్వాత… జానారెడ్డి రంగంలో కి దిగారు. మీరు ఎవరినైనా పీసీసీ చేయండి.. కానీ కొద్దీ రోజులు ఆగండి..లేదంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ కి నష్టం అవుతుందని చెప్పారట.

ఇక దీని పై రంగంలోకి దిగిన పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ జూమ్ ఆప్ లో సమావేశం పెట్టడం… జానారెడ్డి అభిప్రాయాన్ని జోడించి…సోనియాగాంధీ ముందు నోట్ పెట్టారట. ఇక అందరూ ఒకే అనేశారు. జానారెడ్డి చెప్పారు కాబట్టి…ఇక సాగర్ ఎన్నికల వరకు అగుదాం అనే అభిప్రాయానికి వచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉందని… ప్రక్రియ ప్రారంభం కి ముందు ఇంఛార్జి ఠాగూర్ కి తెలియదా.. దీని వెనకాల ఎవరి వ్యూహం ఉందన్నది ఇప్పుడు తెర మీదకు వచ్చింది.

సాగర్ ఎన్నికల కంటే ముందు పీసీసీ నిర్ణయం తీసుకుంటే అటు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్… ఉత్తమ్ సహకరించరనే భయం ఉందా..? లేదంటే అధిష్టానం కి చెందిన నాయకుడికి కూడా పీసీసీ పేరు నచ్చలేదా..? అనే టాక్ మొదలైంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు అయితే మిగిలిన వారికి నచ్చక పోవచ్చు. కానీ జీవన్ రెడ్డి వివాదా రహితుడి అని చెప్పి ఆయన్ని పీసీసీ చేసినా ఇబ్బంది అవుతుందని కారణం చూపెట్టడం వెనక మరొక వ్యూహం ఉందనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి పెద్దలు జానారెడ్డి రంగంలోకి దిగడంతోనే..పీసీసీ నియామకం తాత్కాలిక వాయిదా పడింది అనిపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news