సంక్రాంతి పండుగ పూట రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల బకాయిల చెల్లింపులకు ఏపీ ఆర్థిక శాఖ రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ నిధులు మంజూరు అయ్యాయి. రైతులకు చెల్లించాల్సిన 15 రోజులకు పైబడిన బకాయిలు చెల్లింపులకు పౌర సరఫరాల సంస్థకు ఈ రోజు ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదల అయ్యాయి.
ఈ మొత్తం నగదును రైతుల ఖాతాల్లోకి నేరుగా చేరేలా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. రైతులకు మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంకా కొనాల్సిన ధాన్యం రైతులవద్ద నుంచి పూర్థిస్థాయిలో కొనుగోలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.