వికటించిన వ్యాక్సిన్… 29 మంది మృతి

-

ఒక పక్క భారతదేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలైతే మరో పక్క కరోనా వ్యాక్సిన్ వికటించి భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. అయితే ఇది మన దేశంలో కాదు నార్వే దేశంలో కరోనా ఫైజర్ వ్యాక్సిన్ వికటించి నిన్న 23 మంది చనిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్య ఇప్పుడు ఇరవై తొమ్మిదికి చేరింది. ఇంకా చాలా మంది తీవ్ర అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

vaccine
vaccine

మరి కొంత మంది జ్వరం దగ్గుతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది 75 – 85 ఏళ్ల పైబడిన వారే ఉన్నారని చెబుతున్నారు. దీనికి సంబందించి నార్వే గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో అధిక వయసు ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోవద్దని నార్వేజియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్  హెల్త్ ప్రకటించింది. డాక్టర్లు సైతం ప్రజలకు దీని మీద సూచనలు జారీ చేయాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news