టీ సర్కార్ కు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగించింది. ధరణిపై మధ్యంతర ఉత్తర్వులని జూన్ 21 వరకు హై కోర్టు పొడిగించింది. ధరణి పై అభ్యంతరాలను మంత్రి వర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని హై కోర్టుకు ఏజీ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఏజీ ప్రసాద్ కోరారు.
ధరణిపై దాఖలైన ఏడు పిల్స్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న హైకోర్టు, ధరణి పై 2 పిల్స్ మీద మాత్రమే విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. మరో ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తోసిపుచ్చింది హైకోర్టు.