వీడియో వైరల్‌: సైకిల్‌పై 33 అంతస్తులు.. 30 నిమిషాల్లో ఎక్కాడు..!

-

కొందరు అసాధారణమైన స్టంట్లు, విన్యాసాలు చేస్తుంటారు. వాటిని సామాన్య ప్రజలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికే కొందరు ఎత్తైన కొండలపై నుంచి సైక్లింగ్‌ చేస్తుంటారు. కొంచెం అదుపు తప్పినా ప్రాణానికే ప్రమాదం. అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు వొళ్లు జలదరిస్తాయి. వీరి విన్యాసాలు చూస్తే మతి పోయేలా ఉంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు వీళ్లు మనుషులేనా అనే భావనలో వచ్చేస్తుంటాం.

cyclist
cyclist

ఇలాంటి విన్యాసాలతోనే ఫ్రెంచ్‌ సైక్లిస్ట్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అతను చేసిన ఈ సైక్లిస్ట్‌ స్టంట్లను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ అతను ఏం చేసి ఉంటాడని ఆలోచిస్తున్నారా..? 33 అంతస్తులు ఉన్న బిల్డింగ్‌ మెట్లను సైకిల్‌పై 30 నిమిషాల్లో అవలీలగా ఎక్కేశాడు.

మౌంటెన్‌ బైకర్‌ అరిలిన్‌ ఫాంటెనయ్‌ అనే సైక్లిస్ట్‌ ట్రినీటీ టవర్‌లోని 33 అంతస్తుల్లోని 768 మెట్లను 30 నిమిషాల్లో ఎక్కేశాడు. మొదటి మెట్టు ప్రారంభం నుంచి సైకిల్‌పైని నుంచి కాలుని కింద పెట్టకుండా అవలీలగా ఎక్కేశాడు. 33వ ఫ్లోర్‌ ఎక్కిన తర్వాత కూడా ఎవరైనా అలసిపోయి హమ్మయ్య అని కింద పడుకుంటారు. కానీ ఫాంటెనయ్‌ సైకిల్‌ను ఎత్తుకుని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

వీడియో ప్రారంభంలో చూస్తుంటే మొదటి మెట్టు ప్రారంభం నుంచి సైకిల్‌పై అతికష్టం మీద జంప్స్‌ చేస్తూ పైకి చేరుకున్నాడు. చివరిలో కొంచెం ఆయాసపడినట్లు కనిపిస్తది. కానీ చివరికి 768 మెట్లను పూర్తి చేసుకుంటాడు. పై అంతస్తుకు చేరుకున్న తర్వాత అరిలిన్‌ ఫాంటెనయ్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. 33 అంతస్తు ఎక్కాలని ఛాలెంజ్‌గా తీసుకున్నా.. విజయవంతంగా పూర్తి చేస్తానని ఊహించలేదు. ఫోర్లు ఎక్కేకొద్ది భుజాలు, కాళ్ల కండరాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. చివరి అంతస్తు చేరుకున్నప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకుడదని భావించి.. ఆత్మనిర్భరంతో టార్గెట్‌ను రీచ్‌ అయ్యా.’’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news