కేంద్ర బడ్జెట్ లో కీలకం ఇవే

-

కూలీ నుంచి కోటీశ్వరుడి వరకు అందరినీ కాటేసింది కరోరా రక్కసి. కరోనా తెచ్చిన కష్టాల కడలి నుంచి ఇంకా బయటపడనేలేదు. ఇలాంటి తరుణంలో మోగనున్న బడ్జెట్‌ భాజా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అన్నిరంగాలకూ ఆశలు భారీగానే ఉన్నాయి. అల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థను పురోగతి బాట పట్టిస్తారా… సామాన్యుడికి స్వావలంభన చేకూరుతుందా..? ఎప్పటిలాగే అందని ద్రాక్షలా మారుతుందా..అన్నది ఆసక్తి రేపుతుంది.

కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన తర్వాత మోడీ సర్కార్‌‌కు ఇది తొలి బడ్జెట్‌‌ కావడంతో.. అటు ప్రభుత్వ, ప్రతిపక్ష, పారిశ్రామిక వర్గాల్లోనే కాకుండా ఇటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ ఏర్పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇంతకుముందెన్నడూ లేనివిధంగాగా ఈ బడ్జెట్ తయారు చేస్తున్నట్లు ప్రకటించడంతో… అందరిలో కేంద్ర బడ్జెట్‌‌పై ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి.

కరోనా సంక్షోభం తర్వాత అన్నీ ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతున్నాయి. వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ ఇచ్చే బాధ్యత కేంద్ర ఆర్థిక మంత్రిపై ఉంటుంది. కరోనా కారణంగా తీవ్రంగా న్మష్టపోయిన రంగాల్లో టూరిజం ఒకటి. ప్రత్యేకించి విమానయానం, హోటళ్ల బిజినెస్‌‌ దారుణంగా దెబ్బతింది. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాంటి తరుణంలో వస్తున్న యూనియన్‌ బడ్జెట్‌పై భారీ ఆశలే పెట్టుకుంది పర్యాటక రంగం.

ఉపాధి కల్పనకు మరో ప్రధాన రంగం రియాల్టీ అండ్‌ హౌసింగ్. దేశంలో అసంఘటిత రంగానికి చెందిన కోట్లాది మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగానికి ఇప్పటికే ప్రకటించిన పన్ను రిబేట్లు, రాయితీలను మరింతగా పెంచే అంశాలు ఈ బడ్జెట్‌‌లో ఉంటే మేలంటున్నారు నిపుణులు.ముఖ్యంగా ఎంఐజీల అర్హత, ప్రిన్సిపల్‌‌, వడ్డీ తిరిగి చెల్లింపు క్రైటీరియా పరిమితులు పెంచితే రియాల్టీ రంగంలో డిమాండ్ పెరుగుతుంది. రియాల్టీ, హౌసింగ్ రంగంపై ఆధారపడ్డ సిమెంట్, ఐరన్, పెయింట్ వంటి ఇతర ఉప రంగాలు ప్రభావితమై ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనాలకు పనులు పెరిగితే వాళ్లకు కొనుగోలు శక్తి మెరుగవుతుంది.

పారిశ్రామిక రంగంలో ఉపాధి పెంచే ఉద్దీపనాలు ఈ బడ్జెట్‌‌లో ఉండాలని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వర్గాల ప్రతినిధులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ పరిశ్రమ పన్నుల చెల్లింపుల విషయంలో ఒక ఏడాది పాటు రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు. మన దేశంలో 50 % ఎగుమతులు మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ సంస్థల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి వాటి ఉత్పత్తులపై ఎక్స్‌‌పోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని… సబ్సిడీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్ అందజేయాలని.. షేర్ ట్రాన్సాక్షన్ టాక్స్, కార్పొరేట్ టాక్స్ లను పెంచకుండా యథావిధిగా కోనసాగించాలని కోరుతున్నారు.

కేవ‌లం స్మార్ట్‌ఫోన్లు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల‌పై దిగుమ‌తి సుంకాలు పెంచినా.. ఎలక్ట్రిక్‌ వాహ‌నాలు, ఫర్నిచర్‌ దిగుమ‌తిపైనా ప్రతికూలత ప‌డుతుంద‌ని అధికారవ‌ర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ఫ‌ర్నీచ‌ర్ మేజ‌ర్ ఐకియా యాజ‌మాన్యాలు.. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాల దృష్టికి తీసుకెళ్లాయి. ఇప్పటికే భార‌త్‌లో ఫ‌ర్నీచ‌ర్ మార్కెట్‌లోకి ఐకియా ప్రవేశించి నాలుగేళ్లు కావస్తోంది. త్వరలో టెస్లా ఎంట్రీ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news