నిన్న ప్రకాశం, నేడు అనంతలో టీడీపీ అభ్యర్ధుల కిడ్నాప్ !

-

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎలా అయినా ఈ సారి వీలైనంత అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయించాలని పట్టుదలతో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి తరఫున అలాగే ఇతర పార్టీల తరఫున నామినేషన్ కి వేయడానికి వెళుతున్న వారి మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న ఏకంగా ప్రకాశం జిల్లా పెద్దగంజంలో సర్పంచ్ నామినేషన్ వేయడానికి వెళ్తున్న టిడిపి అభ్యర్థి తిరుపతి రావుని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఉదయం అనంతపురం జిల్లాలో కూడా అలాంటి ఈ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోని బానేపల్లి అనే ఊరిలో టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న ఈరన్న అనే వ్యక్తిని వైసీపీకి చెందిన కొందరు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కర్ణాటక ప్రాంతంలోని ఒక గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనను అడ్డుకుని కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లి కొట్టారని తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news