ఐటెల్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.5,499 మాత్ర‌మే..!

-

మొబైల్స్ త‌యారీ కంపెనీ ట్రాన్‌ష‌న్ భార‌త్‌లో కొత్త ఐటెల్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఐటెల్ ఎ47 పేరిట ఆ ఫోన్ సోమ‌వారం విడుద‌లైంది. ఇందులో 5.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్ ఉంది. 2జీబీ ర్యామ్ ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై గో ఎడిష‌న్ ఓఎస్ ఉంది. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. వెనుక వైపు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీంతో కేవ‌లం 0.2 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌వ‌చ్చు. ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ కూడా ఈ ఫోన్ లో ల‌భిస్తోంది. ఈ ఫోన్ లో 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

itel A47 smart phone launched in india

ఐటెల్ ఎ47 ఫీచ‌ర్లు…

* 5.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే
* 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ యూనిసోక్ ప్రాసెస‌ర్
* 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్
* 5, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ ఫ్రంట్ కెమెరాలు
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
* 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఐటెల్ ఎ47 స్మార్ట్ ఫోన్ ఐస్ లేక్ బ్లూ, కాస్మిక్ పర్పుల్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో విడుద‌లైంది. రూ.5,499 ధ‌ర‌కు ఈ ఫోన్ అమెజాన్‌లో ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news