మనం అనేక వంటల్లో అల్లాన్ని విరివిగా వాడుతాం. అల్లం తో టీ లాంటివి కూడా చేసుకుంటాం. అయితే విరివిగా ఉపయోగించే అల్లం వలన కలిగే ఉపయోగాలు గురించి చాల మందికి తెలియదు. అయితే మరి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. అల్లాన్ని తీసుకుంటే శరీరం లో జీర్ణ శక్తి పెరుగుతుంది. అలానే కండరాల నొప్పులు తగ్గుతాయి. ప్రతీ రోజు మీరు తాగే టీ లో దీనిని వేసుకుంటే అనారోగ్యం దరిచేరదు. అల్లం లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరం లోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
అల్లం బరువు తగ్గాలనుకునే వారికి మంచి పరిష్కారం చూపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు అల్లం తీసుకుంటే మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయం లో మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగు పరచడానికి ఇది సహాయ పడుతుంది. అంతే కాదండి కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగ పడుతుంది. అల్లం రక్తం లోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది కనుక మధుమేహం ఉన్న వారు తీసుకుంటే మరెంత మేలు కలుగుతుంది.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. కడుపు లో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది. వికారం తో బాధ పడుతున్న వారికి ఇది మంచి మందు కూడా. చూసారా ఎన్ని ప్రయోజనాలో..! మరి అల్లాన్ని మీ డైట్ లో చేర్చుకోండి. అనేక సమస్యల నుండి బయట పడండి.