హైదరాబాద్ లో ఏకంగా 70 మంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసిన ఒక కేటు గాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన సుమంత్ అనే వ్యక్తి హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటూ అమెజాన్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు. పగలంతా ఉద్యోగం చేసే సుమంత్ రాత్రి అయ్యాక అమ్మాయిలా అవతరిస్తాడు. ఇంస్టాగ్రామ్ లో అమ్మాయిల పేర్లతో ఖాతా తెరిచే సుమంత్ అమ్మాయిలకు దగ్గరవుతాడు.
అవతల పక్క చాట్ చేసేది కూడా అమ్మాయే కదా అని కొంత మంది అమ్మాయిలు తమ తమ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. ఆ సమయంలోనే కొన్ని పర్సనల్ పిక్స్ కూడా సుమంత్ సేకరిస్తాడు. పిక్స్ వచ్చాక సుమంత్ లోని దుర్మార్గుడు నిద్రలేస్తాడు, వెంటనే రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి వారిని మానసికంగా కృంగదీస్తాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఈ కేటుగాడి ఆట కట్టించారు. ఇలా ఈ కేటుగాడు మొత్తం రకరకాల పేర్లతో 70 మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఇతని మీద పలు రకాల కేసులు నమోదు చేసి ఇ కోర్టుకు తరలించారు.