నిరుద్యోగ భృతి పై క్లారిటీ వచ్చినట్టేనా..పథకానికి ఎవరు అర్హులు

-

తెలంగాణలో నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారన్న అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ పథకానికి ఎవరు అర్హతలు ఏంటి ..ఎంత మందికి భృతి అందే చాన్స్ ఉంది అన్న అంశం పై డిబేట్ మొదలైంది. నిరుద్యోగ భృతికి అర్హత పోందేందుకు ఎటువంటి విధివిధానాలు ఖరారు చేయాలి..ఎంత మంది ఉన్నారు అన్నదాని పై దృష్టిసారించింది తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం.

2018 ముందస్తు ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నిరుద్యోగ భృతి కింద 3వేల 16 రుపాయలు ఇస్తామని ప్రకటించారు సియం కేసిఆర్. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నిరుద్యోగ భృతి అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. అప్పడప్పుడు రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ ఎన్నికల హమీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

మంత్రి కేటిఆర్ ప్రకటనతో ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందించే దిశగా అడుగులు వేస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో రెండు మూడు రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో ఉంది. నిరుద్యోగులు ఎవరు అని తేల్చడం సంక్షిష్టమైన అంశంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కొంత సమాచారం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ సర్వే ప్రకారం నిరుద్యోగులు 11 నుంచి 12 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అమలు చేసే పరిస్థితుల్లో ఎంత మందికి ఇస్తారు..ఏమైన లిమిట్ పెడతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలోని ఎంప్లాయిమెంట్ ఎక్సైంజ్ లలో 90వ దశకంలో నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు. ఇప్పుడు యువత దీనిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేసిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎంప్లాయిమెంట్ ఎక్సెంజ్ లో నమోదు చేసుకున్న వారు ఏడున్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా.
అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 60 వేల మంది నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.

నిరుద్యోగ భృతి కింద 3 వేల 16 రుపాయలు ఇస్తామని గతంలో సీఎం కేసిఆర్ ప్రకటించారు. ఛత్తీస్‌గడ్‌, హిమచల్ ప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలులో ఉంది. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిదాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వయస్సు , విద్యార్హతను పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అందిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న నిరుద్యోగ భృతి స్కీంలో కుటుంబ అదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగ భృతి ఇస్తున్న రాష్ట్రాలు కనీసం 15 వందల రుపాయలు అందిస్తున్నాయి.

వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అమలుచేసే అవకాశం ఉంది. కరోనా ప్రభావం నుంచి రాష్ట్ర అర్ధిక పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది..

 

Read more RELATED
Recommended to you

Latest news