పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. ఏ విషయమైనా తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు. సమాజంపై సామాజిక స్పృహ కల్పించేలా తల్లిదండ్రులు తోడ్పాడును అందజేస్తుంటారు. ఎంతో కష్టమైన విషయాలను సున్నితంగా పరిష్కరించుకునేలా తల్లిదండ్రులు సూచనలు అందజేయాలి. పిల్లలను పెంచేటప్పుడు ఎంతో సహనంగా అవసరం. చిన్న చిన్నవిషయాలకు చిరాకు పడకుండా.. వారిలో ఉన్న తప్పులను చెబుతూ మానసిక స్థైర్యాన్ని నింపాలి. చిన్నప్పుడే సమస్యలను ఎదుర్కొవడం నేర్చుకున్నట్లయితే భవిష్యత్లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు.
పిల్లలు శారీరక ఎదుగుదలతోపాటు మానసికంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. ప్రస్తుత తరుణంలో కొందరు తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారిని చూస్తున్న పిల్లలు కూడా అలానే తయారువుతున్నారు. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తట్టుకోకపోవడంతో అనేక సమస్యలు తలెత్తున్నాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొవాలి. చదువులో ఎప్పుడైనా వెనకబడితే ధైర్యంగా చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే.. బెదిరించకుండా నార్మల్గా మాట్లాడుతూ మందలించాలి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకు అదే పనిగా ఏడవడం మొదలు పెడుతుంటారు. చురుకుదనం కోల్పోయి భయపడుతూ కూర్చుంటారు. ప్రతి చిన్న విషయానికి భయానికి అలవాటు పడితే మాట్లాడేందుకు సాహసించరని, అలానే మౌనంగా ఉండిపోతారని నిపుణులు చెబుతున్నారు. అల్లరి చేయకుండా.. ఇంట్లోనే ఉండటం వల్ల మానసిక రుగ్మతలు ఎదురవుతాయని వారు పేర్కొంటున్నారు.
మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ తల్లిదండ్రులు భరోసా కల్పించాలి. మౌనంగా ఉన్నప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుని సమస్య అర్థమయ్యేలా వివరించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఎంత శ్రద్ధ వహిస్తారో.. పిల్లలు కూడా అంతే శ్రద్ధగా మాటలు వింటారని, తల్లిదండ్రులు ఉన్నారనే భరోసా వస్తుందన్నారు.
పిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలకు అలవాట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు మంచి అలవాట్లు నేర్పించాలి. వారితో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి ఆటలు, ఎక్సర్సైజ్, రన్నింగ్, యోగాసనాలు వేయడం వల్ల శారీరకంగా, మానసికంగా పిల్లలు ధృడమవుతారు.