లైగర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?

-

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా కి లైగర్ అనే పేరు అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. నిజానికి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే పేరు ఉంటుందని అందరూ భావించారు. కానీ లైగర్ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. దానినే ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ నెల 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక లైగర్ అంటే పులికి సింహానికి క్రాస్ బ్రీడు. అంటే మగ సింహానికి ఆడపులికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారు.

విజయ్ ని కూడా అంత పవర్ఫుల్ గా ఈ సినిమాలో చూపించనున్నాడు అన్నమాట పూరీ. విజయ్ దేవరకొండ కూడా సింహం లాంటి తండ్రికి పులి వంటి పెండ్లికి పుట్టిన క్రాస్ బ్రీడ్ అన్న అర్థం వచ్చేలా పూరి టైటిల్ ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో విజయ్‌ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.  పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news