ప్రస్తుతం చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య ఊబకాయం. అందుకే ఇప్పుడు చాలా మందికి ఈ సమస్య వెంటాడుతోంది. అందుకే బరువు తగ్గడానికి కొన్ని వందల వెయిట్ లాస్ డైట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016లో బాగా సెర్చ్ చేసిన డైట్స్‌లో గోలో డైట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ డైట్ చాలా పాపులర్ అవుతోంది. అయితే ఈ డైట్ గురించి కొన్ని తెలుసుకుందాం రండి.
శరీరంలోని క్రొవ్వు తగ్గించడానికి గోలో డైట్ హార్మోన్లని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతోంది. హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగి నిద్ర లేకుండా చేస్తాయి. ఈ డైట్ ఫాలో అయినప్పుడు ఆకలి, నీరసానికి దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి జాగ్రత్తతో డైట్‌ను ఫాలో అయితే మంచి ఫలితాలు సాధించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
గోలో డైట్ ఫాలో అవుతున్న వారికి డైట్, ఎక్సర్‌సైజ్ వల్ల బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గినా బాడీని మెయింటెన్ చేయలేమంటున్నారు. అయితే ఈ డైట్‌ని ఫాలో అవ్వడానికి ‘రిలీజ్’ అనే క్యాప్సూల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
రిలీజ్ క్యాప్సూల్‌లో బరువు తగ్గడానికి శారీరక, మానసిక అంశాలని బ్యాలెన్సింగ్‌గా ఉంచేందుకు ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్స్, కీ మినరల్స్‌ను అందిస్తుంది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఈ క్యాప్సూల్‌ను కొద్ది రోజులపాటు ఆహారంతో తీసుకోవాలి. ఐదు నుంచి పది కిలోల బరువు తగ్గాలని భావిస్తే క్యాప్సూల్ డోస్‌ను తగ్గిస్తే సరిపోతుంది. నేషనల్ మెడిసిన్ కాంప్రహెన్షన్ డేటా బేస్ ప్రకారం ఈ క్యాప్సూల్‌లోని ఇన్‌గ్రీడియెంట్స్ వికారానికి దారి తీస్తాయి. జీర్ణవ్యవస్థ మందగించేలా చేస్తుందని పేర్కొంది.
గోలో డైట్‌లో గోలో మెటబాలిక్ ఫ్యూయెల్ మాట్రిక్స్ డైట్‌ను ఫాలో అవ్వాలి. ఇందులో నాలుగు సెక్షన్ల వరకు ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్, వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు డైట్‌కు తగ్గట్లు ఆహారాన్ని తీసుకోవచ్చు. ప్రోటీన్‌కు సంబంధించి ఎగ్స్, మీట్, పౌల్ట్రీ, సీ ఫుడ్, నట్స్, డైరీ ప్రొడక్ట్స్. కార్బ్స్‌కు సంబంధించి బెర్రీస్, పండ్లు, చిలగడదుంప, బంగాళా దుంప, బీన్స్, హోల్ గ్రెయిన్స్. వెజిటబుల్స్‌కు సంబంధించి బ్రకోలి, పాలకూర, మొలకలు, క్యాలీఫ్లవర్, సెలెరీ, క్యుకుంబర్, జుకీనీ వంటి ఆహారాన్ని తీసుకోవాలి.