ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకి చేరుకోగా కీలకమైన మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. వచ్చే నెల 10వ తేదీన 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మునిసిపాలిటీలు ఒక ఎత్తయితే..రాజధాని ప్రాంతం విజయవాడ,గుంటూరు ఒక ఎత్తుగా మారాయి. మూడు రాజధానులపై ఈ ప్రాంతంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఓ వైపు కొందరు రైతులు..మరో వైపు ప్రతిపక్షాలు రాజధాని తరలింపు వ్యతిరేకిస్తున్న వేళ గుంటూరు, విజయవాడ మేయర్ పీఠం పై ఆసక్తి నెలకొంది.
అమరావతి అంశం మున్సిపల్ ఫలితాలను ప్రభావితం చేస్తుందా ఇప్పుడిదే రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో మళ్లీ ప్రక్రియ మొదలైంది. ఇటు పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మంచి ఫలితాలు సాధించింది. కోర్ క్యాపిటల్ కు సమీపంలో ఉన్న గ్రామాల్లో కూడా వైసిపి విజయం సాదించింది. అటు మంగళగిరి నియోజవకర్గంతో పాటు, ఇటు కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా వైసిపి మద్దతు దారులే గెలిచారు. అయితే ఇప్పుడు మనిసిపోల్స్ ఎలా ఉండబోతున్నాయనేది అంతటా ఆసక్తిగా మారింది.
కార్పొరేషన్ ఎన్నికలు అటు అధికార పక్షానికే కాకుండా, ఇటు ప్రతిపక్షానికి కూడా ఇప్పుడు పెద్ద సవాల్ గా మారాయనే టాక్ ఉంది. ఈ రెండు కార్పొరేషన్ లలో వైసిపి విజయం సాధిస్తే, మూడు రాజధానులకు స్థానికంగా కూడా ఆమోదం ఉందని గట్టిగా చెప్పుకోగలుగుతుంది. అదే టిడిపి గనుక ఈ ఎన్నికలను గెలుచుకుంటే, అమరావతి ఉద్యమానికి ఊపిరి పోసినట్లు అవుతుందని రెండు పార్టీలు లెక్కలేసుకుంటున్నాయట.
గుంటూరు నగరానికి జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి తొలిసారి పోటీ చేస్తోంది. దీంతో ఆ పార్టీకి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు చివరిసారిగా 2005లో జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరువాత పలు గ్రామాలను కార్పొరేషన్ లో కలిపారు. అయితే, ప్రభుత్వ ఆనాసక్తి వల్ల ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు 10 ఏళ్ల తరువాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి గుంటూరు మేయర్ ను గెలుచుకుని తీరాలి. గుంటూరు లో వైసిపికి ఒక ఎమ్మెల్యే గెలవగా…టిడిపిలో గెలిచిన మద్దాలి గిరి కూడా వైసిపిలో చేరారు.
57 డివిజన్లు ఉన్న గుంటూరులో కోవెల మూడి రవీంద్ర ను మేయర్ అభ్యర్థిగా టిడిపి రంగంలోకి దింపింది. వైసిపి అభ్యర్థి పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్థానికంగా టిడిపి నుంచి బలమైన నాయకత్వం లేకపోవడం పార్టీకి ఈ ఎన్నికల్లో కొంత నష్టమే. వీటిని తట్టుకుని గుంటూరు కార్పొరేషన్ పై జెండా ఎగుర వెయ్యడం టిడిపికి అంత ఈజీగా సాద్యం అయ్యే పని కాదనే వాదన వినిపిస్తోంది.
ఇక 64 డివిజన్లు ఉన్న విజయవాడలో ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. నగరంలో ఎంపీతో పాటు బలమైన నేతలు టీడీపీకి ఉన్నారు. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థి కావడంతో నాని కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని గెలుచుకోలేకపోతే అమరావతి ఉద్యమం నీరుకారుతుందని టీడీపీ లెక్కలేసుకుంటోందట. ఓవరాల్ గా అటు గుంటూరు..ఇటు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు రెండుపార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.