ఫేక్ ఐపీఎస్ అధికారిణి ప్రేమ.. రూ.11 కోట్ల మేర మోసం..!

-

ప్రేమ పేరుతో మోసం చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బాగా డబ్బున్న వారికి వలేసి.. సులభంగా మోసం చేస్తున్నారు కొందరు. ప్రేమించి.. పెళ్లి చేసుకుంటామని నమ్మించి.. చివరకు అవసరాలు ఉన్నాయని డబ్బులు గుంజుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ డబ్బున్న వ్యాపారి, ఒక ఐపీఎస్ అధికారిణి పరిచయం పెళ్లి దాకా దారి తీసింది. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ఒప్పందం కుదిరాక ఆమె అతని వద్ద పలు దఫాలుగా రూ.11 కోట్లు తీసుకుంది. అంతా బాగానే సాగుతున్న సమయంలో పెళ్లి మాత్రం జరగలేదు.. అప్పుడు గ్రహించాడు ఆ వ్యాపారి తాను మోసపోయానని. ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారిణి ఇలా ఎలా మోసం చేసిందని ఆరా తీశాడు. అప్పుడు బయట పడింది అసలు నిజం. ఆమె అసలు ఐపీఎస్ అధికారిణి కాదని.. పచ్చి మోసగత్తె అని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Love-cheating
Love-cheating

అసలేం జరిగింది..?
హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరారెడ్డి అనే వ్యక్తికి కోట్లల్లో ఆస్తి ఉంది. ఈ మధ్యకాలంలోనే అతడికి శృతి సిన్హా అనే ఐపీఎస్ అధికారిణి పరిచయమైంది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఒకరికి ఒకరు అండగా ఉండాలని భావించారు. అలానే వీరారెడ్డి.. శృతి సిన్హా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుండేవాడు. ఆమె కూడా పలుసార్లు వీరారెడ్డిని తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని డబ్బులు అడిగి తీసుకునేది. అలా మొత్తంగా పదకొండు కోట్ల రూపాయిలు అప్పజేప్పాడు. ఎంతకాలం వేచి చూసిన పెళ్లి ఊసైతే ఉండటం లేదని గ్రహించిన వ్యాపారి ఆమె గురించి విచారించి నమ్మలేని నిజాలు తెలుసుకున్నాడు.

శృతి సిన్హా ఐపీఎస్ అధికారి కాదని.. ఆమె ఆరితెరిన మోసేగత్తే అని తెలుసుకుని పోలీసులను అశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. శృతి సిన్హాతోపాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.6 కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news