రోడ్లు లేని గ్రామం

-

మనం ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణించాలంటే తప్పనిసరిగా రోడ్డు మార్గం కావాలి. కానీ, మీరిక్కడ తెలుసుకోబుతున్న గ్రామంలో మాత్రం అస్సటు రోడ్లు ఉండవు. మరి అక్కడివారు ఎలా ప్రయానం చేస్తారు అంటే..
నెదర్లాండ్‌ లోని డచ్‌ ప్రావిన్స్‌ ఓవర్‌ జెస్సెల్‌లో రోడ్లు లేని ఒక అందమైన గ్రామం ఉంది. ఈ వింత గ్రామంలో పడవలపై మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే గైథూర్న్‌.. ఈ గ్రామం కాలువలతో నిండి ఉంటుంది. పడవమార్గంలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ప్రకృతి ఒడిలో హాయిగా చేసే ప్రయాణం మరపురాని అనుభూతిని ఇస్తుంది. మీరు ఈ అనుభూతిని పొందాలంటే ఇక్కడకు రావాల్సిందే అది కూడా కేవలం పడవ ప్రయాణం చేస్తూ.

కార్లు కనిపించవు

ఇది కార్లు నడపడానికి అణువైన ప్రదేశం కాదు. అంస్టంర్‌ డామ్‌ నుంచి గంటన్నర డ్రైవింగ్‌ చేసి ఈ గ్రామానికి చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో ప్రయాణం చేయాలనుకుంటే పడవ లేదా బైక్‌ ను అద్దెకు తీసుకోవాలిజ

గైథూర్న్‌ ఇది ఒక విస్తారమైన నేచర్‌ రిజర్వ్‌. 13 వ శతాబ్దంలో మొదటి ఈ ప్రాంతంలో స్థిరపడిన ఫ్రాన్సిస్కాన్‌ సన్యాసులు చెట్ల రవాణా కోసం ఈ కాలువను తవ్వారు. దీన్ని లిటిల్‌ వెనీస్‌ అనికూడ పిలుస్తారు. రానురాను 180కి పైగా వంతెనాలు నిర్మించారు.

రాకపోకలు ఇలా..

ఈ గ్రామ రోడ్లు రోజంతా చాలా నిశబ్దంగా ఉంటుంది. గైథూర్న్‌లో చాలా మంది ప్రజలు ప్రైవేటు ద్వీపాల్లో నివసిస్తారు. 3000 కంటే తక్కువ నివాసాలు ఉంటాయి. ఇది నెదర్లాండ్‌ సందర్శకుల ప్రధాన పర్యాటక కేంద్రం. వివిధ దేశాల నుంచి టూరిస్టులు వస్తారు. మీ వాహనాలను గ్రామం బయట పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఇళ్లకు వంతెన మార్గంలో నే వెళ్లాలి.
కాలువలు వంతెనలతో పాటు ఇక్కడ అనేక ఆకర్షణీయమైన సైక్లింగ్‌ కూడా ఉంటుంది. సైక్లింగ్‌ ఎంపిక మంచిది. అలాగే మీకు నచ్చినపుడు తిరగడానికి ఉపయోగపడుతుంది.
ఇక్కడ అనేక మ్యూజియంలు, చర్చిలు పుష్కలంగా కనిపిస్తాయి. పిల్లల కోసం అనేక కళా ప్రదర్శనలు కూడా ఉన్నాయి.

ఐస్‌ స్కేటింగ్‌ అద్భుతం

శీతాకాలంలో గొప్ప హాలిడే స్పట్‌ ఇది. సమీపంలోని సరస్సులపై మంచు స్కేటింగ్‌ చేయవచ్చు. ఈ గ్రామంలో నీటి ఒడ్డున హోటళ్లు ఉంటాయి.శీతాకాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం అంత మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news