అబ్ధుల్ కలాం.. కలలు కనండి. వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్న మాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో చెప్పాల్సిన పనిలేదు. రామేశ్వరం వద్ద పుట్టి స్కాలర్ షిప్పులతోనే చదువుకుని భారత దేశానికి రాష్ట్రపతిగా ఎదిగిన మహానాయకుడాయన. ఆయన మాటలు చాలా ప్రేరణనిస్తాయి. విజయం సాధించడానికి ఆయన చెప్పిన మాటలు ఏంటో ఒక్కసారి తలచుకుందాం.
ఒక పని చేయాలంటే దాని గురించి కల కనాలి. ఆ పని చేయగలను అన్న నమ్మకం ఉండాలి. అసాధ్యం అన్న పదాలని మెదడులోంచి తీసివేయాలి. అసాధ్యం అన్న మాటలు నిన్ను ఏ పనీచేయకుండా ఆపేస్తాయి. సివి రామన్, ఐజాన్ న్యూటన్, గ్రహంబెల్ మొదలగు వారు కలలు కన్నారు. అది అసాధ్యం అని వారికి అనిపించలేదు. అందుకే ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నంలో ఎన్నో ఆవిష్కరణలని మనకి అందజేసారు. అసాధ్యం అనుకుని ఆగిపోయుంటే ఆ ఆవిష్కరణలు ఇప్పుడు ఉండేవా? విజయం సాధించాలనుకునే వారి ఆలోచనలు కూడా అలాగే ఉండాలి.
సాధ్యం కానిదేదీ ఈ ప్రపంచంలో లేదు. గొప్ప గొప్ప కలలు కనాలి. విజయం సాధించినపుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో అని కాదు, వైఫల్యం చెందినపుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలో తెలుసుకోవాలి. వైఫల్యాన్ని డీల్ చేయడం నేర్చుకున్నవాడు ఎక్కువ ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు విజయాలకి దారులు తీస్తాయి. వైఫల్యం వస్తుందేమో అని చెప్పి, పనులే మొదలుపెట్టకం పోవడం కరెక్ట్ కాదు. కలలు కనాలి, వాటి కోసం కృషి చేయాలి, దాన్నుండి వచ్చిన ఫలితాన్ని అనుభవించాలి.
పద్మభూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990), భారత రత్న (1997) అందుకున్న అబ్దుల్ కలాం గారి మాటలు ఎంతో ప్రేరణని అందిస్తాయి.