యుఏఎన్ నెంబర్ ని మర్చిపోయారా..? అయితే ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని ఇలా చూసుకోండి..!

-

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO కస్టమర్లకి యఏఎన్ నెంబర్ ని ఉపయోగించి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి సదుపాయం కల్పించింది. అయితే కస్టమర్లు యుఏఎన్ నెంబర్ ని మర్చిపోయినా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ని నాలుగు విధాలలో చూడచ్చు. ఇది మీరు ఈపీఎఫ్ పోర్టల్ లో చూడవచ్చు. UMANG యాప్ ద్వారా మీరు దీనిని తెలుసుకోవచ్చు. లేదా మిస్డ్ కాల్ మరియు ఎస్ఎంఎస్ సర్వీసుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

యుఏఎన్ నెంబర్ ఆక్టివేట్ చేసుకోవాలంటే అఫీషియల్ పోర్టల్ ద్వారా చేసుకోవాలి. యుఏఎన్ నెంబర్ ని కనుక మర్చిపోయారు అంటే పీఎఫ్ బ్యాలెన్స్ ని మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే మిస్డ్ కాల్ ఇవ్వాలి గమనించండి. ఇలా చేస్తే యూఎన్ నెంబర్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే పోర్టల్ లో కేవైసి డీటెయిల్స్ కూడా ఉంటాయి. యుఏఎన్ నెంబర్ ఆక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు.

దీని కోసం ముందుగా ఈపీఎఫ్ వెబ్సైట్ కి వెళ్లి ఆక్టివెట్ యూఏఎన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత యుఏఎన్ ,పేరు, డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయండి. ఇది యుఏఎన్ ని ఆక్టివేట్ చేస్తుంది. పాస్ వర్డ్ మొబైల్ నెంబర్ కి వస్తుంది. ఇలా మీరు యు ఏ ఎన్ నెంబర్ ఆక్టివేట్ చేసుకోవచ్చు. యుఏఎన్ యాక్టివేట్ చేసిన ఆరు గంటల తర్వాత మాత్రమే బాలన్స్ చెక్ చేసుకోవడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news