ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కాస్త గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రివర్గంలోకి ఆసక్తి చూపించటంతో జగన్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని క్యాబినెట్లోకి తీసుకున్నా సరే వేరే వాళ్ళతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ కాస్త ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
ముఖ్య నేతల విషయంలో ఆయన ఆసక్తికరం గా ఉన్నారని విజయవాడలో వైసీపీ బలోపేతం చేసే క్రమంలో ఇటీవల విజయవాడలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ఒక మహిళా నేతను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది.
మంత్రి బొత్స సత్యనారాయణతో మాణిక్య వరప్రసాద్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కి తీసుకునే క్యాబినెట్లోకి విషయంలో కూడా ఉత్సాహం చూపిస్తున్నారని సమాచారం. అలాగే రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా జగన్ క్యాబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. త్వరలోనే పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు.