ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఈ పద్ధతులని అనుసరించండి…!

-

ప్రతిరోజు ఇంట్లో ఉండే కుర్చీలు, టేబుల్స్ మొదలైన వాటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శుభ్రంగా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటూ ఉంటారు. అలానే శుభ్రంగా లేకపోతే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు అని చెప్తూ ఉంటారు.

ఇంట్లో మాసిపోయిన దుస్తులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి. లాండ్రీ బాస్కెట్ ని ఉపయోగించి మాసిన దుస్తుల్ని అందులో ఉంచండి. ఉతికిన దుస్తులుని కబోర్డ్ లో మడతపెట్టి సర్దుకోండి. ఇలా చేయడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది.

ఇంట్లో సువాసన ఉన్న నూనె ఉపయోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మొక్కలుకి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిని మొక్కలు మీద స్ప్రే చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండి నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో ఉండే మ్యాట్స్, కర్టెన్లు వారానికి ఒకసారి క్లీన్ చేయండి.

వాస్తు ప్రకారం వీటిని శుభ్రం చేయడం వల్ల దుమ్ము, ధూళి తో లేకపోవడం మాత్రమే కాకుండా నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా మన నుంచి దూరం అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని సులువుగా తరిమికొట్టే పద్ధతి ఏమిటంటే..? ఇంట్లో లైట్ వేయడం లేదా మూలల్లో కొవ్వొత్తులు పెట్టడం లాంటివి చేయడం మంచిది. ఇలా దీపాలు వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

సెంటెడ్ క్యాండిల్స్ ని వాడడం వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ధ్యానం చేయడం వల్ల కూడా నెగటివ్ ఎనర్జీని తొలగించొచ్చు. అందుకే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దేవుడిని తలచుకుని ధ్యానం చేయడం వల్ల ఎంతో శాంతంగా ఉండొచ్చు. అలానే ఇల్లు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

ఇంటి ఆవరణ లో, ఇంట్లో మొక్కలు వేయడం వల్ల కూడా ఎంతో మంచిగా ఉంటుంది. మొక్కల ద్వారా వచ్చే ఆక్సిజన్ ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఇంట్లో తులసి మొక్క వేయడం వల్ల ఎంతో శుభ్రంగా మరియు నెగిటివ్ ఎనర్జీ ని తొలగించడానికి ఉపయోగ పడుతుంది.

ప్రతి రోజు యోగా మరియు మెడిటేషన్ చేయడం వల్ల మన ఆవరణ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ తో నిండి ఉంటుంది. దీని వల్ల మీకు మీ కుటుంబానికి కూడా నెగటివ్ ఎనర్జీ రాకుండా మిమ్మల్ని ప్రశాంతంగా, హాయిగా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news