తెలుగు రాష్ట్రాలకు కొత్త టెన్షన్.. వ్యాక్సిన్ @ నో స్టాక్ ?

-

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపని వారు సైతం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులకు సరిపడా మాత్రమే ప్రస్తుతానికి వ్యాక్సిన్ నిల్వలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఏపీలో మూడు లక్షల డోస్ లు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోపక్క తెలంగాణలో కూడా కరోనా వ్యాక్సిన్ డోసులు నిల్వలు తగ్గిపోయాయి. ఇంకా 8 లక్షల డోస్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు లక్షల డోస్ లు రెండు రోజులకి సరిపడా మాత్రమే ఉంటాయని చెబుతున్నారు. వెంటనే వ్యాక్సిన్ పంపాలని కేంద్రాన్ని రెండు రాష్ట్రాలు కోరాయి. మొత్తం మీద జనాల్లో కరోనా భయం పెరగడంతో వ్యాక్సిన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news