ఐపీఎల్: MI vs KKR.. చేజార్చుకున్న నైట్ రైడర్స్.. ముంబై ఘన విజయం..

-

153పరుగుల లక్ష్య ఛేధనలో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు, ఆరంభంలో మంచి శుభారంభాన్ని అందించింది. ఓపెనర్లుగా దిగిన నితేష్ రానా, శుభ్ మన్ గిల్ తమదైన ఆటతో జట్టుకి మంచి స్కోరుని అందించారు. ఐతే వీరిద్దరి భాగస్వామ్యాన్ని రాహుల్ చాహర్ విడదీసాడు. అయినా కూడా నితేష్ రానా తన బ్యాట్ తో పరుగుల వరద పారించాడు. కానీ తనకి సరైన భాగస్వామ్యం ఎవరూ అందించలేదు. జట్టు స్కోరు 122పరుగుల వద్ద నితేష్ రానా పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఏ ఆటగాడు కూడా జట్టుని ముందుకి నడిపించలేకపోయాడు.

చకచకా వికెట్లు పడిపోవడంతో నైట్ రైడర్స్ గెలవాల్సిన మ్యాచ్ కాస్తా ముంబై వైపు మళ్ళింది. చివరి ఓవర్లో మరీ దారుణంగా మారింది. ఆండ్రూ రస్సెల్, పాట్ కమిన్స్ ఒకరి తర్వాత ఒకరు వెనువెంటనే వెనుదిరగడంతో నైట్ రైడర్స్ కి గెలుపు కష్టమైంది. మొత్తానికి 20ఓవర్లు పూర్తయ్యే సరికి 142పరుగులు మాత్రమే చేయగలిగింది. 10పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది.

కోల్ కతా బ్యాట్స్ మెన్లలో నితేష్ రానా 57పరుగులు (47బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), శుభ్ మన్ గిల్ 33పరుగులు (24బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్) చేసారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news