తిరుపతిలో వైసీపీ ఇబ్బంది పడేది ఇక్కడే…?

-

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎంత విజయం సాధించిన, పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని పంచాయితీలు గెలిచిన సరే తిరుపతి ఎన్నికల్లో మాత్రం ఓడిపోతే పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంది అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

కొన్ని కొన్ని అంశాల్లో వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో కొన్ని సామాజిక వర్గాల నేతలు కనపడటం లేదు అనే భావన ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు దూరంగా ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి జగన్ వద్ద ఆదరణ ఉన్నా సరే జిల్లా నేతల ఆదరణ లేదు అని కొంతమంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ విషయంలో సీరియస్ గా కనపడటం లేదని సమాచారం. కొంతమంది వర్గ విభేదాలు కారణంగా పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉండటం ఇప్పుడు వైసీపీని కలవరపెడుతున్న అంశం. అందుకే బీసీ సామాజికవర్గాలు తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీకి దూరం జరిగే అవకాశాలు ఉండవచ్చు అని లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే పార్టీ ఓటమికి కూడా కారణం అవ్వచ్చు అని లేకపోతే మెజారిటీ తగ్గడానికి కూడా కారణమయ్యే సూచనలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news