వైరస్ కారణంగా బ్యాంకుల పని వేళల్లో మార్పులు…!

-

కరోనా కేసులు మరో సారి ఎక్కువవుతున్నాయి. రోజు రోజు కి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యం లో కరోనా ఎఫెక్ట్ బ్యాంక్ ఖాతాదారులపై కూడా ప్రభావం పడే అవకాశం వుంది. అందుకే బ్యాంక్ టైమింగ్స్ మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంక్ యూనియన్లు ఇప్పటికే ఆర్థిక శాఖకు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే బ్యాంక్ ఉద్యోగుల భద్రత నేపథ్యం లో వారికి పని గంటలను తగ్గించాలని అంటున్నారు లేదా పని దినాలను తగ్గించాలని యూనియన్లు డిమాండ్ చేయడం జరిగింది.

అయితే తక్కువ సిబ్బంది తో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU ఇప్పటికే ఆర్థిక శాఖ కార్యదర్శి దెబాశిష్ పాండాకు మెమరాండమ్ కూడా అందించింది.

కరోనా తీవ్రత ఎక్కువై పోయింది కాబట్టి వేగంగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. బ్యాంక్ యూనియన్ల డిమాండ్‌ను కేంద్రం పరిగణ లోకి తీసుకుంటే శని వారం, ఆది వారం బ్యాంకులు ఇక పని చేయకపోవచ్చు. ఇది ఇలా ఉంటే బ్యాంక్ పని వేళల్లో కూడా మార్పులు వచ్చే ఛాన్స్ వుంది.

Read more RELATED
Recommended to you

Latest news