వాటిలో పెట్టి డ్రగ్స్ తెచ్చాడు, చివరికి అలా దొరికేశాడు !

-

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ (కాందహార్) ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 6.3 కోట్ల విలువ చేసే హెరాయిన్ అనే డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ను ఆటోమొబైల్ పరికరంలో అమర్చి తరలించే యత్నం చేసిన ఆఫ్ఘనిస్తాన్ దేశస్తుడు తనిఖీల్లో దొరికిపోయాడు.

ఎయిర్‌పోర్ట్ పోర్టులో సదరు ప్రయాణికుడి పై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి మోసుకొచ్చిన ఆటోమొబైల్ పరికరాల లో దాచిన 907 గ్రాముల డ్రగ్స్ గుట్టును కస్టమ్స్ కనిపెట్టారు. తెల్లటి పౌడర్ రూపంలో వున్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు స్మగ్లర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news